
రిలీజ్‌కు ముందే వరుస రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది ప్రభాస్ నటిస్తున్న ‘సాలార్’ చిత్రం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ.. ఇటీవల విడుదలైన టీజర్‌తో రికార్డ్స్ క్రియేట్ చేసింది. విడుదలైన ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక మంది చూసిన ఇండియన్ సినిమా టీజర్‌గా నిలిచింది. ఇప్పుడిక ఏ ఇండియన్ సినిమాకు సాధ్యం కానీ మరో రికార్డ్‌ను క్రియేట్ చేస్తోంది.
నార్త్ అమెరికాలో ఏకంగా 1979 లొకేషన్స్‌లో మూవీ రిలీజ్ కాబోతోంది. అక్కడ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ప్రత్యంగిరా సినిమాస్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రభాస్ బర్త్ డే ఇయర్‌ను గుర్తు చేస్తూ 1979 థియేటర్స్‌లో ప్రీమియర్స్ వేస్తున్నారు. తెలుగు సినిమాను నార్త్ అమెరికాలో ఇన్ని లొకేషన్స్‌లో రిలీజ్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్.
సెప్టెంబర్ 28న ఇండియాలో ఈ సినిమా విడుదల కానుండగా.. 27న యూఎస్‌లో ప్రీమియర్ షోస్ పడనున్నాయి. ప్రభాస్‌కు జంటగా శ్రుతిహాసన్ నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరీ రావు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈనెల 20న కామిక్ కాన్ ఈవెంట్‌లో ‘ప్రాజెక్ట్ కె’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నారు. ఇందుకోసం యూఎస్ వెళ్లిన ప్రభాస్‌కు అక్కడి అభిమానులు కార్లతో ర్యాలీ చేస్తూ వెల్‌కమ్ చెప్పారు.