ప్రభాస్ తో సెల్ఫీ : కలనా..నిజమా అంటూ చెంప తాకింది

ప్రభాస్ తో సెల్ఫీ : కలనా..నిజమా అంటూ చెంప తాకింది

అభిమాన హీరో కనిపిస్తే చాలు పోటీ పడుతూ సెల్ఫీలు తీసుకునేందుకు రెడీ అయిపోతారు ఫ్యాన్స్. అయితే ఓ అమ్మాయి ఒక్క అడుగు ముందుకేసి, హీరోను జస్ట్ టచ్ చేసి మురిసిపోయింది. ఈ అనుభవం మన టాలీవుడ్ హీరో ప్రభాస్ కు ఎదురైంది. ఇటీవల ప్రభాస్‌ సాహో సినిమా షూటింగ్ లో భాగంగా లాస్‌ ఏంజిల్స్ వెళ్లాడు.

అక్కడి ఎయిర్‌ పోర్ట్‌ లో ప్రభాస్‌ తో సెల్ఫీ దిగేందుకు ఫ్యాన్స్ పోటీపడ్డారు. ప్రభాస్‌ తో సెల్ఫీ దిగిన ఓ యువతి.. గంతులు వేస్తూ ప్రభాస్ చెంపను తడిమింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ప్రభాస్ తో సెల్ఫీ దిగడం కలనా..నిజమా అనుకుని టచ్ చేసిందేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం సాహా షూటింగ్ క్లైమాక్స్ ఉంది. ఆగస్టు 15న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది సినిమా యూనిట్.