ప్రస్తుతం ప్రభాస్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న స్పిరిట్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. కాగా ఆ మధ్య స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ కి సంబంధించిన పోస్టర్ విడుదల కాగా ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు అమాంతం పెరిగాయి.
కాగా ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్ లో విడుదల చేసేందుకు సందీప్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే స్పిరిట్ సినిమా కోసం నిర్మాతలు దాదాపుగా రూ.500 కోట్లు బడ్జెట్ వెచ్చిస్తున్నారు. దీంతో అత్యంత ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఇండియన్ చిత్రాలలో స్పిరిట్ మొదటి స్థానంలో నిలుస్తోంది. అయితే మొన్నటివరకూ కల్కి చిత్ర సక్సస్ ని ఎంజాయ్ చేసిన ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్ చిత్ర షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడు.
ఈమధ్య కాలంలో టాలీవుడ్ సినిమాలు ప్రపంచానికి పరిచయం అవుతున్నాయి. ఈ క్రమంలో రిలీజ్ డే రోజునే రూ.100 కోట్ల కలెక్ట్ చేస్తున్నాయి. దీంతో నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనుకడుగెయ్యటం లేదు. టాలీవుడ్ హీరో ప్రభాస్ కి ప్రస్తుతం ప్యాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ ఉంది. దీంతో కథని బట్టి దర్శక నిర్మాతలు వందల కోట్ల రూపాయల బడ్జెట్ వెచ్చిస్తున్నారు.