Spirit: విమల్ థియేటర్‌లో ‘స్పిరిట్’ షూటింగ్.. ప్రభాస్‌తో కీలక షెడ్యూల్ మొదలుపెట్టిన వంగా!

Spirit: విమల్ థియేటర్‌లో ‘స్పిరిట్’ షూటింగ్.. ప్రభాస్‌తో కీలక షెడ్యూల్ మొదలుపెట్టిన వంగా!

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్పిరిట్’(Spirit). ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ‘స్పిరిట్’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. సందీప్ రెడ్డి వంగా దాదాపు రెండు నెలల పాటు సాగే భారీ లాంగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే కొంపల్లి, అజీజ్‌నగర్, కోటి ఉమెన్స్ కాలేజ్ తదితర ప్రాంతాల్లో కీలక షెడ్యూల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసిన చిత్రబృందం, ప్రస్తుతం నెక్స్ట్ షెడ్యూల్ జరుపుకుంటుంది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ ఇవాళ జూన్1న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మాస్ క్రౌడ్ ఎక్కువగా ఉండే బాలానగర్ విమల్ థియేటర్‌లో ఈ ప్రత్యేక షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఓ కీలక సన్నివేశాన్ని చిత్రీకరించనున్నట్లు సమాచారం. ప్రభాస్ పాల్గొనే ఈ షూటింగ్ కోసం అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం.

ఈ షెడ్యూల్ రెండు రోజుల పాటు కొనసాగనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం విమల్ థియేటర్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సెట్స్, అక్కడ జరుగుతున్న పనులకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

►ALSO READ | PEDDI Event: ‘పెద్ది’ ఈవెంట్‌ చీఫ్ గెస్ట్పై సస్పెన్స్.. చివరి నిమిషంలో భారీ ట్విస్ట్..

ప్రభాస్‌కు ఉన్న అపారమైన క్రేజ్ దృష్ట్యా షూటింగ్ లొకేషన్ వద్ద భారీ సంఖ్యలో అభిమానులు చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో బాలానగర్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణలు చేపట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. సందీప్ రెడ్డి వంగ మార్క్ ఇంటెన్స్, ఫైర్ బ్రాండ్ క్యారెక్టరైజేషన్‌తో ప్రభాస్ పాత్ర మరింత రౌద్రంగా, తీవ్రంగా ఉండబోతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ప్రభాస్‌కు జోడీగా, 'యానిమల్' బ్లాక్‌బస్టర్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి డిమ్రి నటిస్తుంది. ప్రభాస్-త్రిప్తిల ఫ్రెష్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ చూడటానికి ప్రేక్షకులు ఉత్సాహంగా ఉన్నారు. వీరితో పాటు, ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘స్పిరిట్’ చిత్రాన్ని టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం మార్చి 5, 2027న ప్రపంచ దేశాల అభిమానుల ముందుకు రానుంది.