
వేదిక లీడ్ రోల్లో హరిత గోగినేని తెరకెక్కిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఫియర్’. దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రభుదేవా రిలీజ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు.
చీకటి గదిలో హీరోయిన్ వేదిక భయపడుతూ చూస్తున్న పోస్టర్ సినిమాపై ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఇక విడుదలకు ముందే ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్‌లో 60 కి పైగా అంతర్జాతీయ అవార్డులను గెల్చుకున్న ఈ చిత్రం కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో అరవింద్ కృష్ణ, జయప్రకాష్ , పవిత్ర లోకేష్, అనీష్ కురువిల్లా, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.