చిరు, సల్మాన్ పాటకు ప్రభుదేవా డ్యాన్స్ కంపోజ్

చిరు, సల్మాన్  పాటకు ప్రభుదేవా డ్యాన్స్ కంపోజ్

అరవై ఆరేళ్ల వయసులోనూ తన డ్యాన్స్ మూమెంట్స్‌‌‌‌తో మెస్మరైజ్ చేయడం మెగాస్టార్‌‌‌‌‌‌‌‌కే చెల్లింది. ఆయనతో ఓ అద్భుతమైన కొరియోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌ కలిస్తే ఇక ఐఫీస్ట్ అదిరిపోతుంది. ‘గాడ్‌‌‌‌ఫాదర్’ సినిమాతో ప్రేక్షకులకి ఆ అవకాశం దక్కనుంది. ఎందుకంటే ఇందులోని ఓ పాట కోసం ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవాని రంగంలోకి దింపాడు దర్శకుడు మోహన్‌‌‌‌ రాజా. మలయాళ సూపర్‌‌‌‌‌‌‌‌ హిట్ ‘లూసిఫర్‌‌‌‌‌‌‌‌’ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరు, సల్మాన్‌‌‌‌లపై ఓ పాట కూడా ఉండబోతోంది. ఈ పాటకే ప్రభుదేవా డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని తమన్ సోషల్ మీడియాలో రివీల్ చేశాడు. ‘గ్రేట్ న్యూస్. చిరంజీవి, సల్మాన్‌‌‌‌ల కోసం ఒక ఆటమ్ బాంబింగ్ స్వింగింగ్‌‌‌‌ సాంగ్‌‌‌‌కి కొరియోగ్రఫీ చేస్తున్నారు ప్రభుదేవా. చిరు, సల్మాన్‌‌‌‌లు కలిసి డ్యాన్స్ చేయడమంటే ఫ్యాన్స్‌‌‌‌కి పండగే’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ పాట సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని దర్శక నిర్మాతలు కూడా ఫీలవుతున్నారు. త్వరలోనే ఈ పాటని షూట్ చేయబోతున్నారు. చిరు, ప్రభుదేవాల  కాంబినేషన్‌‌‌‌లో ఇప్పటికే పలు సూపర్ హిట్‌‌‌‌ సాంగ్స్ వచ్చాయి కాబట్టి ఈ పాటపై కూడా భారీ అంచనాలు ఏర్పడటం ఖాయం. నయనతార, పూరి జగన్నాథ్, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్.బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ కలిసి నిర్మిస్తున్నారు.