50 ఏళ్ల వయసులో తండ్రైన ప్రభుదేవా.. ముచ్చటగా మూడోసారి

50 ఏళ్ల  వయసులో తండ్రైన ప్రభుదేవా.. ముచ్చటగా మూడోసారి

ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరుతెచ్చుకున్న ప్రభుదేవా(Prabhudeva) ముచ్చటగా ముడోసారి తండ్రయ్యాడు. ప్రభుదేవాకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నయనతార(Nayanathara) ఆయన జీవితంలోకి వచ్చాక ప్రభుదేవాకు మొదటి భార్యతో విబేధాలు తలెత్తాయి. దాంతో కొన్నేళ్ల క్రితం వారు విడిపోయారు.

 మొదటి భార్యతో విడాకులు తీసుకున్న ప్రభుదేవా కొంతకాలం సింగిల్ గానే ఉన్నాడు. ఇక మూడేళ్ళ క్రితం పిజియోథెరపిస్ట్ హిమానీ సింగ్(Himani Singh) ను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రభుదేవా- హిమానీ సింగ్ కు ఆడపిల్ల జన్మించిందని సమాచారం. ఈ విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచాలనుకుంటున్నాడట. ఇక ప్రస్తుతం ప్రభుదేవా వయస్సు 50 కావడంతో. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ హాఫ్ సెంచరీకి నీకు మంచి గిఫ్ట్ వచ్చింది అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.