
టాలీవుడ్ టాప్ యాంకర్స్ లిస్ట్‌లో ముందువరుసలో ఉంటారు ప్రదీప్, రష్మి. ఇప్పుడు ఈ ఇద్దరూ ఓ అరుదైన రికార్డ్ సృష్టించారు. ప్రముఖ బ్రిటన్ జర్నలిస్ట్ కిరణ్ రాయ్ రిలీజ్ చేసిన ఆసియాలోని 400 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ లిస్టులో చోటు సంపాదించారు వీళ్లు. ఈ విషయాన్ని స్వయంగా రష్మి , ప్రదీప్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహ్మాన్, సోనూ నిగమ్, రహత్ ఫతే అలీ, జాకీర్ లాంటి ప్రముఖులున్న జాబితాలో మాకు చోటు దక్కడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు వీళ్లిద్దరూ