
రైతులకు కూడా పెన్షన్ అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకంలో భాగంగా ఈ సదుపాయం కల్పిస్తోంది. 60 యేళ్లు నిండిన ప్రతి రైతు నెలకు రూ. 3వేల చొప్పున పెన్షన్ ను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. నేరుగా రైతు ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి. చిన్న, సన్నకారు రైతులకు సామాజిక భద్రత కల్పించాలని లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.
అర్హతలు ఇవే ..
- చిన్న, సన్నకారు రైతులు అయి ఉండాలి .. అంటే 5 ఎకరాల్లోపు భూమి ఉండాలి
- 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయస్సున్న ప్రతి రైతులు ఈ స్కీం కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకంలో చేరిన వారు నెలకు రూ. 55 చొప్పున చెల్లించాలి. గరిష్టంగా రూ. 200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఏ వయసులో ఈ పథకంలో చేరారనే అంశంపై ప్రాతిపదికన మీరు చెల్లించాల్సిన మొత్తం ఆధారపడి ఉంటుంది.
- 18 ఏళ్ల వయసులో స్కీమ్ లో చేరితే రూ. 55 (నెలకు )
- 40 ఏళ్ల వయసులో స్కీమ్ లో చేరితే రూ. 200(నెలకు)
కావాల్సిన డాక్యుమెంట్లు
- ఆధార్ కార్డు,
- సేవింగ్ బ్యాంక్ అకౌంట్
- పట్టాదారు పాస్ బుక్
పథకంలో ఎలా చేరాలంటే ?
పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన స్కీంలో చేరాలంటే.. రెండు ఆప్షన్లు ఉన్నాయి.
1. మీకు దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ లో అప్లయ్ చేయొచ్చు.
2. ఆన్ లైన్ కూడా ఈ స్కీంకు అప్లయ్ చేయొచ్చు. మొబైల్ నంబర్, ఓటీపీ సాయంలో పథకంలో చేరొచ్చు.
వీరు ఈ పథకంలో చేరేందుకు అనర్హులు
- ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ ఐ)
- నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్ పీఎస్)
- శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన
- వ్యాపారి మాన్ ధన్ యోజన
- ఆదాయం పన్ను చెల్లించేవారు
- ప్రభుత్వ ఉద్యోగులు