Pragya jaiswal: బంపర్ ఆఫర్ కొట్టేసిన ప్రగ్యా.. ఏకంగా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్

Pragya jaiswal: బంపర్ ఆఫర్ కొట్టేసిన ప్రగ్యా.. ఏకంగా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్

కంచె సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ప్రగ్య జైస్వాల్(Pragya jaiswal). ఈ సినిమా మంచి విజయం సాధించింది కానీ, ఈ అమ్మడుకు అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. ఒకటి అరా సినిమాలు చేసినా.. అవి కూడా ఆమె కెరీర్ కు అంతగా ఉపయోగపడలేదు. ఇక చాలా కాలం తరువాత బాలకృష్ణతో అఖండ సినిమాలో చేసే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తరువాత మళ్ళి సినిమాల్లో కనిపించలేదు. 

అయితే.. తాజా సమాచారం మేరకు ఈ అమ్మడుకు అదిరిపోయే ఆఫర్ ఒకటి వచ్చిందట. అవును.. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా ఖేల్ ఖేల్ మే అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్ నటిస్తున్నారని తెలుస్తోంది. అందులో తాప్సి, వాణి కపూర్‌ ఇప్పటికే ఫైనల్ అవగా.. తాజాగా ప్రగ్యాను ఫిక్స్ చేశారట మేకర్స్. ఈ సినిమాతో దాదాపు పదేళ్ల తరువాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది ప్రగ్యా.

త్వరలోనే ఆమె పార్ట్ కు సంబందించిన షూట్ కంప్లీట్ చేసి ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారట మేకర్స్. ఈ న్యూస్ తెలిసిన నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కాస్త లేట్ అయినా అదిరిపోయే ఆఫర్ కొట్టేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కనీసం ఈ సినిమాతో అయినా ఆమెకు మంచి బ్రేక్ రావాలని అంటున్నారు.