కొట్టుకుపోయిన గుండ్లకమ్మ రిజర్వాయర్​ ప్రాజెక్ట్​ గేటు

కొట్టుకుపోయిన గుండ్లకమ్మ రిజర్వాయర్​ ప్రాజెక్ట్​ గేటు

ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ రిజర్వాయర్​ ప్రాజెక్ట్​ గేటు కొట్టుకుపోయింది. మల్లవరం కందుల ఓబుల్ రెడ్డి (గుండ్లకమ్మ రిజర్వాయర్‌)  ప్రాజెక్టు  3వ గేటు గతంలోనే కొట్టుకుపోయింది. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో మరమ్మతులు జరగలేదని ఆరోపణలుండగా శుక్రవారం రాత్రి ( డిసెంబర్​ 8) రెండో గేటు అడుగు భాగం మిచౌంగ్​ వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో ప్రాజెక్ట్​ లోని నీరు వృథాగా పోతుంది. అయితే  రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు అని అధికార యంత్రాంగం సూచిస్తోంది.. ఇదే సమయంలో.. దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి వరద నీరు చేరింది.. . ప్రాజెక్టులో ప్రస్తుతం 2.5 టీఎంసీల నీటి నిల్వ ఉండగా.. నీరు వృథాగా కిందికి పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.2022వ సంవత్సరంలో 3వ నంబర్ గేటు కొట్టుకుపోవటంతో పూర్తిస్థాయిలో ఇప్పటివరకు మరమ్మతులు పూర్తికాకపోగా.. ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యంతో.. మరోగేటుకు అదే పరిస్థితి వచ్చిందని రైతులు మండిపడుతున్నారు..