పవన్ OGలో నందా ఎంట్రీ.. ఇది నెక్స్ట్ లెవల్ ట్విస్ట్

పవన్ OGలో నందా ఎంట్రీ.. ఇది నెక్స్ట్ లెవల్ ట్విస్ట్

పవన్ కళ్యాణ్ OG మూవీ నుండి క్రేజీ అప్డేట్. సాహో మూవీ ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ.. ఈమధ్యే ముంబయిలో స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ సంధర్బంగా విడుదల చేసిన మేకింగ్ వీడియోకి ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ స్పాట్ నుండి లీకైన పవన్ ఫోటో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. అంటే ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఇక తాజాగా ఈ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో మరోసారి పవన్, ప్రకాష్ రాజ్ కాంబో ఆడియన్స్ ని థ్రిల్ చేయబోతుందట. అవును.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ  సినిమాలో నెగెటీవ్ రోల్లో కనిపించనున్నాడట. ఆన్ స్క్రీన్ లో వీరి కాంబోకి మంచి క్రేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా బద్రీలో కూడా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. ఈ సినిమాలో నందా పాత్రలో అదిరిపోయే పెరఫార్మెన్స్ ఇచ్చాడు ప్రకాష్ రాజ్. పవన్, ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే సీన్స్ కూడా నెక్స్ట్ లెవల్లో ఉంటాయి.

ఇక తాజాగా వచ్చిన పవన్ రీ-ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ లో కూడా వీళ్ళ మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయించాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే మరోసారి ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయాలనుకుంటున్నాడట సుజీత్. OG లో కూడా వీళ్ళ మధ్య వచ్చే సీన్స్ నెక్స్ట్ లెవల్లో ప్లాన్ చేసాడట. ఈ న్యూస్ తెసులుకున్న పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో తమిళ బ్యూటీ ప్రియాంక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు.