రేషన్ షాపుల్లో బియ్యంతో పాటు ఉప్పు, పప్పులు, చిరుధాన్యాలు

రేషన్ షాపుల్లో బియ్యంతో పాటు ఉప్పు, పప్పులు, చిరుధాన్యాలు
  • పాల ఉత్పతులు కూడా
  • జన్ పోషణ్ కేంద్రాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
  • పైలట్ ప్రాజెక్టులో తెలంగాణ

ఢిల్లీ: రేషన్ షాపుల్లో బియ్యంతోపాటు పప్పులు, ఉప్ప, చిరుధాన్యాలు, పాల ఉత్పత్తులు లభించనున్నాయి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు నాణ్యమైన పోషకాలు అందించాలనే లక్ష్యంతో పాటు రేషన్‌ షాప్‌ డీలర్ల ఆదాయాన్ని పెంచడమే ధ్యేయంగా పైలట్‌ ప్రాజెక్ట్‌ ను ప్రారంభిస్తున్నట్టు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి వెల్లడించారు. వీటి పంపిణీ కోసం పైలట్  ప్రాజెక్టుగా ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, తెలంగాణ ప్రాంతాల్లోని 60 రేషన్‌ షాపులను ఎంపిక చేసినట్టు చెప్పారు.

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రేషన్ షాపులు కేవలం 8- 9 రోజులు మాత్రమే తెరుస్తున్నారని మంత్రి అన్నారు. మరికొన్ని అయితే మూడు నెలలకు ఒకసారి మాత్రమే పనిచేస్తాయని చెప్పారు. మిగిలిన సమయాల్లో ఆ దుకాణాలను మూసేస్తున్నారని అన్నారు. డీలర్లకు ప్రస్తుతం ఉన్న కమీషన్లు సరిపోవట్లేదని, అందుకోసం ప్రత్యామ్నాయ విధానాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.