
న్యూఢిల్లీ: మాజీ ప్రెసిడెం ట్ ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్ లో సోమవారం అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అంతకుముందు ఆయనకు డాక్టర్లు బ్రెయిన్ సర్జరీ ని సక్సెస్ ఫుల్గా పూర్తి చేశారు. వారం రోజులుగా తనను కలిసిన వారందరూ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని, కరోనా టెస్ట్ చేయించుకోవాలని ప్రణబ్ సూచించారు. కాంగ్రెస్ చీఫ్ స్పోక్స్ పర్సన్ రణ్‌దీస్ సుర్జేవాలా, నేతలు అభిషేక్ సింఘ్వీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ , యూనియన్ మినిస్టర్ పియూశ్ గోయల్ ప్రణబ్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు.