
కరోనాతో ఆగష్టు 10న ఆస్పత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత దిగజారినట్లు ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ (ఆర్ అండ్ ఆర్) ఆస్పత్రి తెలిపింది. ఆయన ప్రస్తుతం డీప్ కోమాలో ఉన్నారని మరియు వెంటిలేటర్ సపోర్ట్ తోనే కృత్రిమ శ్వాస తీసుకుంటున్నారని తెలిపింది.
‘ప్రణబ్ ముఖర్జీ ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ కు గురయ్యాయి. మంగళవారం నుంచి ఆయన లంగ్స్ మరికొంత క్షీణించాయి. ఆయన కోమాలో ఉండి..వెంటిలేటర్ సహాయంతో శ్వాస తీసుకుంటున్నారు’ అని ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రణబ్ బ్రెయిన్ సర్జరీ తర్వాత కరోనా బారినపడటంతో ఆర్ అండ్ ఆర్ ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి వైద్యులు ఆయన ఆరోగ్యం కుదుటపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
For More News..