మలయాళ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించిన రీసెంట్ హారర్ థ్రిల్లర్ డీఎస్ ఈరే (Dies Irae). అక్టోబరు 31న మలయాళంలో, నవంబరు 7న తెలుగులో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఆరు రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ప్రణవ్ మోహన్ లాల్ తన కెరీర్-బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని, రైటర్-డైరెక్టర్ రాహుల్ సదాశివన్ ఈ హారర్ థ్రిల్లర్‌ను ఫస్ట్ నుండి క్లైమాక్స్ వరకు ఆసక్తిరేపే ఉత్కంఠభరితమైన అంశాలతో తెరకెక్కించాడని రివ్యూస్ వచ్చాయి. ఈ క్రమంలోనే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది.
Also read:- శోభితా స్టయిలే వేరు: హాలీవుడ్ రేంజ్లో గ్లామర్ లుక్స్..
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 5 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే, మలయాళ వెర్షన్ రిలీజ్ కన్ఫర్మ్ కాగా.. తెలుగు వెర్షన్ గురించి ఇంకా స్పష్టత లేదు. మూవీ ల వర్స్ మాత్రం అదే రోజు నుంచే స్ట్రీమింగ్ వేయాలని కోరుతున్నారు. ‘హృదయం’ చిత్రంతో యూత్‌ను ఆకట్టుకున్న ప్రణవ్ మోహన్ లాల్.. సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. ప్రణవ్ అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు.
