
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ప్రణవి మానుకొండ.. ‘స్లమ్ డాగ్ హస్బండ్’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమవుతోంది. సంజయ్ రావు హీరోగా డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వంలో అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రం జులై 29న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ప్రణవి మాట్లాడుతూ ‘‘రొటీన్ లవ్ స్టోరీ’ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన నాకు ‘ఉయ్యాల జంపాల’తో నంది అవార్డు వచ్చింది. త్రిపుర, సావిత్రి, బ్రహ్మోత్సవం లాంటి చిత్రాల్లో నటించాను.
ఆ తర్వాత సీరియల్స్‌లో లీడ్ రోల్స్ చేశా. కానీ సినిమాలపై ఉన్న ఇష్టంతో బ్రేక్ ఇచ్చి, ఇటు వైపు వచ్చాను. ఇందులో మౌనిక అనే పాత్ర పోషించా. రెగ్యులర్ హీరోయిన్ కారెక్టర్‌లా కాకుండా అన్ని రకాల ఎమోషన్స్ ఉండే క్యారెక్టర్. ఫన్ రైడ్‌తో పాటు ఎమోషన్స్‌ను చాలా బాగా బ్యాలెన్స్ చేశారు డైరెక్టర్. మొదటి సినిమాకే మంచి బ్యానర్, పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేయడం హ్యాపీ. రొటీన్ కారెక్టర్స్ కాకుండా ప్రాధాన్యత గల పాత్రల కోసం చూస్తున్నా. కారెక్టర్ డిమాండ్ చేస్తే గ్లామర్‌గా, డీ గ్లామర్‌గా నటించడానికి రెడీగా ఉన్నా’ అని చెప్పింది.