బ్యాంకాక్ : ఇండియా బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోగా.. హెచ్ఎస్ ప్రణయ్ తోటి ఆటగాడు మైరబా చేతిలో తొలి రౌండ్లోనే ఓడి నిరాశపరిచాడు. బుధవారం జరిగిన మెన్స్ డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్స్ సాత్విక్–చిరాగ్ జోడీ 21–13, 21–13తో నూర్ మహ్మద్ అజ్రియిన్–టాన్ వీ కియోంగ్ (మలేసియా)పై వరుస గేమ్స్‌లో విజయం సాధించింది.
కానీ, మెన్స్ సింగిల్స్ తొలి మ్యాచ్‌లో ఐదో సీడ్ ప్రణయ్ 19–21, 18–21తో ఇండియాకే చెందిన మైరబా లువాంగ్ మైస్నమ్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. విమెన్స్ సింగిల్స్‌లో అష్మితా చాలిహా 19–21, 21–15, 21–14తో ఈస్టర్ నురుమి (ఇండోనేసియా)పై గెలవగా..
మాళవిక బన్సొద్ 11–11, 10–21తో టాప్ సీడ్ చైనా షట్లర్ హన్ యుయె చేతిలో ఓడిపోయింది. ఉన్నతి హుడా, ఆకర్శి కశ్యప్, సామియా ఇమాద్, మెన్స్ సింగిల్స్‌లో సతీష్ కుమార్ కూడా తొలి రౌండ్లోనే ఓడి ఇంటిదారి పట్టారు.