తల్లి కాబోతున్న 'అత్తారింటికి దారేది' హీరోయిన్

తల్లి కాబోతున్న 'అత్తారింటికి దారేది' హీరోయిన్

బెంగళూరు: 'అత్తారింటికి దారేది' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ ప్రణీతా సుభాష్ తన ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో తల్లి కాబోతున్నట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ సందర్భంగా భర్తతో దిగిన ఫోటోలను షేర్‌ చేసింది. ఈ ఫొటోల్లో ప్రణీత ఆమె భర్తను హగ్‌ చేసుకుని పట్టలేని ఆనందంతో కనిపిస్తోంది. తన భర్త పుట్టిన రోజున దేవుడు తమకు అద్భుతమైన బహుమతి ఇచ్చాడని ప్రణీత పోస్టు చేసింది. ఆమె పోస్టుపై స్పందించిన సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు బెస్ట్ విషెస్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. 

గతేడాది వ్యాపారవేత్త నితిన్‌ రాజుతో ప్రణీత వివాహం జరిగింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో అతికొద్ది మంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక జరిగింది. ‘ఏం పిల్లో.. ఏం పిల్లడో’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ప్రణీత.. 'రభస', 'డైనమైట్' సహా పలు చిత్రాల్లో నటించింది. పవన్‌ కల్యాణ్‌ సరసన 'అత్తారింటికి దారేది' సినిమాలో నటించి 'బాపు బొమ్మ'గా పాపులర్‌ అయ్యింది.