
పాట్నా: జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్‌కిశోర్ పోలింగ్‌కు ముందే ఓటమిని ఒప్పుకున్నారని ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని పీకే ప్రకటించిన నేపథ్యంలో తివారీ స్పందించారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో తాను, తన పార్టీ అవమానకరమైన ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుందని కిశోర్ గ్రహించారు.
అందుకే పోటీ చేయబోనని ప్రకటించారు. ఎన్నికల్లో గెలవడం.. రాజకీయ పార్టీలకు సలహా ఇచ్చినంతా సులభంకాదని పీకే గ్రహించాలి”అని అన్నారు. బిహార్ బీజేపీ అధికార ప్రతినిధి నీరాజ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఎన్నికలకు ముందే కిశోర్ బుడగ పగిలిపోయింది” అని అన్నారు. జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ మాట్లాడుతూ, కిశోర్ నిర్ణయం తన పార్టీ కార్యకర్తలకు అవమానం అని అన్నారు.