
పాట్నా: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌ల మధ్య వివాదం ముదురుతోంది. నితీశ్‌పై ప్రశాంత్ కిశోర్ శనివారం మరోసారి ఆరోపణలు గుప్పించారు.బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే, జేడీయూ ఎంపీ హరివంశ్‌ను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. ‘‘నితీశ్ జీ.. నిజంగా బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే, మీ ఎంపీని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి రాజీనామా చేయమని అడగండి” అంటూ ట్వీట్ చేశారు.