ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రశాంత్ కిషోర్

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రశాంత్ కిషోర్

రాజకీయ ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త పార్టీ లాంఛ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజకీయ ప్రయాణం బిహార్ నుంచే ఉంటుందని తెలిపారు. అయితే కాంగ్రెస్ లో చేరుతారని తొలుత భావించినా.. భిన్నాభిప్రాయాలు రావడంతో ఆయన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. చాలా కాలంగా తాను అర్థవంతమైన ప్రజాస్వామ్యంలో భాగస్వామిగా ఉన్నానన్నారు ప్రశాంత్ కిషోర్. ప్రజలకు అవసరమైన పాలసీల తయారీ కోసం పదేళ్లుగా పనిచేస్తున్నానని ట్వీట్ చేశారు. ఇప్పుడు రియల్ మాస్టర్ గా మారే సమయం వచ్చిందన్నారు. అంశాలను మరింతగా అర్థం చేసుకునేందుకు జన్ సురాజ్ పేరుతో కొత్త పార్టీతో  వస్తున్నానని చెప్పారు. బిహార్ నుంచి తన ప్రయాణం ప్రారంభిస్తున్నానని చెప్పారు.

ప్రశాంత్ కిషోర్ బీహార్ జనతాదళ్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు యువతను ఆకర్షించడమే లక్ష్యంగా పార్టీ నిర్దేశించిన లక్ష్యాలను అందుకున్నారు.అందులో కొంతమేర విజయం సాధించినట్లుగా భావించారు.ఇప్పటికే పీకే ప్రత్యక్షంగా..పరోక్షంగా వివిధ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రస్తుతం ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం

రష్యా సైనికులను చెచెన్ ఫైటర్​లే కాల్చిచంపిన్రు

మందుల ధరలు 10 శాతం పెరిగే అవకాశం!