ఏపీలో జెండా మార్చిన ప్రశాంత్ కిషోర్

ఏపీలో జెండా మార్చిన ప్రశాంత్ కిషోర్

= టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ
= గత ఎన్నికల్లో వైసీపీకి వ్యవూహకర్తగా..
= ఇప్పుడు టీడీపీకి దన్నుగా ప్రశాంత్ కిషోర్  

హైదరాబాద్: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ మార్చేశారు..! కాదు కాదు వ్యూహం మార్చేశారు. గత ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్(పీకే) ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వ్యూహాలు రచించబోతున్నారని తెలుస్తోంది. ఇవాళ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గన్నవరం విమానశ్రయంలో ప్రత్యక్ష మయ్యారు. వినాశ్రయం నుంచి బయటకు వచ్చిన పీకే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వాహనంలో విజయవాడ బయలుదేరారు. లోకేశ్​తో పాటు ఒకరిద్దరు తెలుగుదేశం నేతలు కూడా ప్రశాంత్ కిషోర్​ను కలిసి వెళ్లారు.

లోకేశ్ వాహనంలోనే చంద్రబాబు నివాసానికి చేరుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్​లో వైఎస్ జగన్ తరపున ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాన్ని అమలు చేశారు. గత ఎన్నికల్లో జగన్ కు పనిచేయడమే కాదు నాలుగున్నరేళ్లుగా అక్కడ పరిస్థితులపై వైసీపీకి ఎప్పటికప్పుడు రిపోర్టులు అందిస్తున్నారు. కొంతకాలం తెలంగాణలో కేసీఆర్ కోసం పనిచేసినా తర్వాత కటీఫ్ అయ్యింది. అప్పటి నుంచి హైదరాబాద్ సహా తెలంగాణలో ఉన్న టీమ్ మొత్తాన్ని ఏపీకి షిప్ట్ చేసి అక్కడ వైసీపీకే పూర్తిస్థాయిలో సేవలు అందించారు. పలుమార్లు ఎమ్మెల్యేల పనితీరుపై రిపోర్టులలిచ్చారు. కొన్నిసార్లు ఎమ్మెల్యేలతో మీటింగ్ లలో పీకే ఉండడం కూడా వార్తలకెక్కింది. ఇంత దగ్గరగా పనిచేసిన పీకేతో జగన్ కి ఎందుకు గ్యాప్ వచ్చిందన్నది అంతుబట్టని విషయం.

ఇదిలా ఉండగా.. ఇటీవల యువగళం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన నారా లోకేశ్, పార్టీ ఎన్నికల సన్నద్ధతపై వివిధ స్థాయిల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ముందే సోషల్ మీడియాను మరింత బలోపేతం చేసేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటి వరకూ టీడీపీ తరఫున రాబిన్ శర్మ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు. ఇదే నిజమైతే ఏపీ సీఎం జగన్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది.