ఈ కామారెడ్డి అమ్మాయి ఆడ పిల్ల మాత్రమే కాదు.. ఆడ పులి.. ఎంత మొండి ఘటం అంటే..

ఈ కామారెడ్డి అమ్మాయి ఆడ పిల్ల మాత్రమే కాదు.. ఆడ పులి.. ఎంత మొండి ఘటం అంటే..

పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెండ్లి చేసి అత్తారింటికి పంపేద్దాం అనుకున్నారు. తనకేమో మెడలు వంచి తాళి కట్టించుకోవడం ఇష్టం లేదు. మెడల్స్ సాధించి తలెత్తుకుని తిరగాలి అనుకుంది. రాత్రింబవళ్లు కష్టపడి ఏకంగా ఆరు స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పతకాలు గెలుచుకుంది. చిన్నచూపు చూసినవాళ్లకు తన ‘ప్రతిభ’తోనే సమాధానం చెప్పింది. అంతటితో ఆగకుండా ఎంతోమంది అమ్మాయిలకు ఫ్రీగా సెల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. వచ్చే మూడేండ్లలో తనలా మరికొంతమందిని ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానంటోన్న ప్రతిభా తక్కడపల్లి గురించి ఆమె మాటల్లోనే..

ఒంటరి పోరాటం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి వచ్చాకే నాకు అసలైన స్ట్రగుల్స్ మొదలయ్యాయి. ఒక హాస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరా. నాది చిన్నప్పటినుంచి క్రమశిక్షణతో కూడిన విలేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. అందుకే ఇమడలేకపోయా. రెండో నెలలోనే ఒక రూమ్ చూసుకుని షిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యా. నా దగ్గరున్న బంగారం తాకట్టు పెట్టి ఏదైనా బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశా. కానీ.. కుదర్లేదు. ఆ తర్వాత చేసేదేం లేక పార్ట్ టైం జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ, డిగ్రీలో చేరా. దాంతోపాటే నా లక్ష్యాన్ని సాధించేందుకు మార్షల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకోవడం మొదలుపెట్టా. అక్కడ కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నా టాలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని గుర్తించి ‘ఎప్పటికైనా నువ్వు ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతావు’ అని చెప్పాడు. అప్పటినుంచి ఇంకా ఎక్కువ కష్టపడి ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశా. అలా ఆరున్నరేండ్ల కష్టం తర్వాత నాకు మొదటి నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చింది. ఆ విషయం పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చింది. అప్పడే మా ఇంట్లో వాళ్లకు నేను బాక్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేర్చుకుంటున్నానని తెలిసింది. 

నీకెందుకు అన్నవాళ్లే.. 

మొదట్లో మార్షల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోటీల్లో పాల్గొంటున్నానని తెలిసి చాలామంది నన్ను విమర్శించారు. ‘హాయిగా పెండ్లి చేసుకో. అమ్మాయిలకు ఇవన్నీ అవసరమా?’ అనేవాళ్లు. నేను మాత్రం చిరునవ్వుతోనే సమాధానం చెప్పేదాన్ని. కానీ.. ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలిచిన తర్వాత పెద్ద పెద్ద నాయకులు కూడా నన్ను సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా ద్వారా అభినందించారు. మా నియోజకవర్గం ఎమ్మెల్యే అసెంబ్లీలో నాగురించి మాట్లాడారు. అప్పుడు నన్ను విమర్శించిన వాళ్లు కూడా నా సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని చూసి అభినందించారు. తమ పిల్లల్ని ట్రైన్ చేయమని నా దగ్గరికి పంపించారు. 

మైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీడియో చూసి..

మాది కామారెడ్డి జిల్లా పిట్లం అనే ఊరు. మా అమ్మా నాన్నలు నర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, శ్యామల. మా ఊళ్లో స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నడిపించేవాళ్లు. నాకు చిన్నప్పటినుంచే అమ్మ పురాణగాథలు చెప్పేది. ఒకసారి హనుమంతుడి బలం గురించి చెప్తే విని ఆశ్చర్యపోయా. నేను కూడా అలా ఎవ్వరినైనా కొట్టగలిగేలా తయారవ్వాలి అనుకున్నా. ఒకసారి మైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తున్న వీడియో చూసినప్పుడు ఆ కోరిక మరింత పెరిగింది. నేను కూడా ఆయనలాగే ఒకే పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నాకౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి అనుకునేదాన్ని. నాకు పదేళ్లు ఉన్నప్పుడు పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మేరీకోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి చదివా. 

ఆమె ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాక్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోటీలో గెలిచి, ఇండియా జెండాను చూపిస్తున్న ఫొటో పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేశారు. ఎప్పటికైనా నేను కూడా బాక్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అలా మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నా. మా కాకా(చిన్నాన్న) కరాటే ఛాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఆయన నాకు కొన్ని పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నేర్పించారు. నేనేమో ఎవరు పడితే వాళ్లకు పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇచ్చేదాన్ని. వాళ్లేమో మా నాన్నకు కంప్లైంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేవాళ్లు. 

ఇంట్లో చెప్తే ఏమన్నారంటే.. 

మేరీకోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి తెలుసుకున్నప్పుడే మా నాన్నకు నేను బాక్సర్ అవుతానని చెప్పా. కానీ.. ఆయన వద్దన్నారు. నాకేమో బాక్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేర్చుకోవాలని ఉండేది. అది గ్రామీణ ప్రాంతం కావడంతో ఎలాంటి స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెసిలిటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండేవి కాదు. కనీసం మంచి గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా లేదు. పైగా ఆడపిల్లలకు పదిహేను.. పదహారు ఏండ్లు రాగానే పెండ్లిళ్లు చేసేవాళ్లు. మా అమ్మానాన్నలు కూడా ఇంటర్ పూర్తవగానే నాక్కూడా పెండ్లి చేయాలని డిసైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు. నేనేమో బాక్సర్ కావాలని కలలు కనేదాన్ని. పెండ్లి ఇష్టం లేదని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఒక సంబంధం కూడా చూసి, పెండ్లికి ఒప్పించే ప్రయత్నం చేశారు. అందుకే నా గోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముఖ్యం అని డిసైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యి, అందర్నీ ఎదిరించి ఇంట్లో నుంచి పారిపోయి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి వచ్చేశా. అమ్మానాన్నలు తిరిగి ఇంటికి రమ్మన్నా.. రానని కరాఖండీగా నా నిర్ణయం చెప్పా. ఆ తర్వాత కొన్నాళ్లు మా మధ్య మాటల్లేవు. 

మూడు గంటల కోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నేను అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఒక సెల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్ కోర్సుని డిజైన్ చేశా. దీన్ని మూడు సెషన్లలో నేర్చుకోవచ్చు. వారంలో ఒకరోజు మాత్రమే గంట సేపు ట్రైనింగ్ ఇస్తా. దాన్ని వాళ్లు వారమంతా ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తారు. అలా మూడు వారాల తర్వాత నాలుగో వారం వాళ్లు ఎంతవరకు నేర్చుకున్నారో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తా. మరికొన్ని రోజుల్లోనే ఈ ట్రైనింగ్ సెషన్స్ మొదలుపెడతా. ఈ బేసిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెషన్స్ అమ్మాయిలు ఎవరైనా నేర్చుకోవచ్చు. 

ఎన్నో ఇబ్బందులు

ఈ జర్నీలో ఎంతమంది అడ్డుకున్నారో నాకు అంతమంది సాయం కూడా చేశారు. నేను ఇన్ని కాంపిటీషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొంటున్నా మొదట్లో గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి పెద్దగా సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దక్కలేదు. కానీ.. కొందరు పొలిటీషియన్స్‌‌‌‌తోపాటు గతంలో మా నాన్న దగ్గర చదువుకున్నవాళ్లు సాయం చేశారు. మన దగ్గర అమ్మాయిలను ఎదగనీయకుండా కొంతమంది అడ్డుపడుతుంటారు. అందుకే కొన్నిసార్లు ఎంతో రిస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటర్నేషనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా ఆడి గెలిచా. ఈ జర్నీలో పొలిటీషియన్ల నుంచి చాలెంజెస్‌‌ కూడా ఎదుర్కొన్నా.  

పదకొండు స్పోర్ట్స్​లో 

ఇండియాలో కిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాక్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, థాయ్ బాక్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్షల్ ఆర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తైక్వాండో, గ్రాఫ్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాక్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఇలా ఆరు స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించిన మొదటి పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేనే. ఎనిమిది రకాల స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించాలనే లక్ష్యంతో నా జర్నీ మొదలుపెట్టా. ఇప్పుడు పదకొండు స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెడల్స్ సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నా. 

ఎంతోమందికి ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఇప్పటివరకు ఎంతోమంది అమ్మాయిలకు సెల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చా. గడిచిన ఆరు నెలల్లోనే 6 వేల మంది నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. చాలాసార్లు రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏరియాలకు వెళ్లి కేజీబీవీ స్కూళ్లలో, అనాథాశ్రమాల్లో అమ్మాయిలకు సెల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్ మీద అవగాహన కల్పించాను. దాదాపు తొమ్మిది వందల మంది తెలంగాణ మహిళా పోలీసు ట్రైనీలకు అంతెందుకు ఐఐటీ మద్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా ఆడపిల్లలకు ట్రైనింగ్ ఇచ్చా. ఇప్పటివరకు ఇవన్నీ ఫ్రీగానే చేశా. ఇకనుంచి ప్రతి శని, ఆదివారాల్లో ప్రత్యేకంగా పెయిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రైనింగ్ సెషన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నా. మూడు సంవత్సరాల్లో వంద మంది ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నా. 

చాలా కష్టపడ్డా

నేను ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకోవడం మొదలుపెట్టిన మొదట్లో దాదాపు మూడున్నర ఏండ్లు చాలా కష్టమైంది. బాడీ పెయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సరిగ్గా నిద్ర కూడా పట్టేది కాదు. ఒకసారి బాగా ఇంజ్యురీ అయ్యింది. అప్పుడు డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండేండ్లు ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి దూరంగా ఉండాలని చెప్పాడు. ఆ విషయం మా అమ్మానాన్నలకు కూడా తెలిసింది. దాంతో వాళ్లు బాక్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వదిలేయమన్నారు. అయినా.. పట్టించుకోకుండా ఆరు నెలలకే మళ్లీ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి వెళ్లా. అంత మొండిగా కష్టపడ్డా. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక్క క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా డుమ్మా కొట్టేదాన్ని కాదు. నేనే కాదు అమ్మాయిలందరూ ఎంత కష్టమైనా తమ కాళ్ల మీద తాము నిలబడగలగాలి. తమకంటూ సొంత గుర్తింపు ఉండాలి. అలాంటివాళ్లనే సమాజం గొప్పగా చూస్తుంది. కాబట్టి ప్రతి అమ్మాయి ఎదగాలి. 
 

మరిన్ని వార్తలు