ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని కుండపోత వర్షాలు బీభత్సం చేస్తున్నాయి.. ఆకాశానికి చిల్లు పడినట్లు జోరు వానలు పడటంతో.. యూపీలోని 12 జిల్లాల్లో జల విధ్వంసం జరిగింది. వీధులు అన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లల్లోని నీళ్లు వచ్చాయి. వాగులు, వంకలు, నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. 12 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది యోగీ సర్కార్.
వరదల కారణంగా గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలోనే ప్రయాగ్ రాజ్ మునిగింది. ప్రయాగ్ రాజ్ చుట్టూ నీళ్లు చేరాయి. అక్కడి జనం పడవల్లో ప్రయాణిస్తున్నారు. ఇళ్లు అన్నీ మునిగిపోవటంతో.. ప్రయాగ్ రాజ్ చుట్టూ ఉన్న 5 లక్షల మంది జనం ప్రమాదంలో పడ్డారు. విషయం తెలిసిన వెంటనే యూపీ మంత్రుల బృందం అత్యవసర ఏర్పాట్లు చేసింది. వందల సంఖ్యలో పడవలను ప్రయాగ్ రాజ్ పంపించింది. జల దిగ్బంధంలో చిక్కుకున్న జనాన్ని పడవల్లో సురక్షిత ప్రాంతాలకు.. ప్రత్యేక శిబిరాలకు తరలిస్తున్నారు అధికారులు.
