అర్హులైన వారికి రేపట్నుంచి ప్రికాషన్ డోస్  

అర్హులైన వారికి రేపట్నుంచి ప్రికాషన్ డోస్  

ఢిల్లీ : దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా సోమవారం నుంచి కోవిడ్ ప్రికాషన్ డోస్ ఇచ్చేందుకు సిద్ధమైంది. మెడికల్ సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రికాషన్ డోస్ ఇవ్వనున్నారు. 60ఏళ్లు పైబడి గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, మూత్రపిండాల వ్యాధి, క్యాన్సర్ తదితర వ్యాధులు ఉన్న వారు ప్రికాషన్ డోసు తీసుకునేందుకు అర్హులని కేంద్రం ప్రకటించింది. రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తైన వారికి మాత్రమే ఈ బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు.

ప్రికాషన్ డోసుల కోసం రిజస్ట్రేషన్ ప్రక్రియను కేంద్రం శనివారం నుంచి ప్రారంభించింది. అర్హులైన వారు కోవిన్ యాప్ ద్వారా ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. వ్యాక్సినేషన్ సెంటర్ లో సైతం ప్రికాషన్ డోస్ అపాయింట్మెంట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇదిలా ఉంటే ప్రికాషన్ డోసులో వ్యాక్సిన్ల మిక్సింగ్ ఉండదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. గతంలో కోవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న వారికి కోవిషీల్డ్, కోవాగ్జిన్ తీసుకుని ఉంటే కోవాగ్జిన్ టీకా మాత్రమే ఇవ్వనున్నారు. 

మరిన్ని వార్తల కోసం...

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మహారాష్ట్రలో మరిన్ని ఆంక్షలు 

తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలకు కేసీఆర్ దావత్