ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మహారాష్ట్రలో మరిన్ని ఆంక్షలు 

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మహారాష్ట్రలో మరిన్ని ఆంక్షలు 

ముంబై : దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ కల్లోలం సృష్టిస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వాలు కట్టడి చర్యలు మరింత కఠినం చేశాయి. ఇందులో భాగంగా మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని చెప్పింది. ఉదయం వేళ 144 సెక్షన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. 

పెళ్లిళ్లు, అంత్యక్రియలకు హాజరయ్యే వారి సంఖ్యపైనా ఆంక్షలు విధించింది. పెళ్లిళ్లకు 50, అంత్యక్రియలకు 20 మందిని మాత్రమే అనుమతించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 15 వరకు స్కూళ్లు మూసివేయాలని, ఆన్లైన్ క్లాసులు కొనసాగించాలని నిర్ణయించింది. స్విమ్మింగ్ పూల్స్, జిమ్, స్పా, వెల్నెస్ సెంటర్లు, పార్కులు, జూలు, మ్యూజియంలు, కోటలు, లోకల్ టూరిస్ట్ స్పాట్లు మూసివేయనున్నారు. హెయిర్ కటింగ్ సెలూన్లు, షాపింగ్ మాల్స్, మార్కెట్లు 50శాతం కెపాసిటీతో పనిచేసుకోవచ్చని ప్రకటించింది. అయితే డబుల్ డోస్ తీసుకున్న వారిని మాత్రమే వాటిల్లోకి అనుమతించనున్నట్లు చెప్పింది. వ్యాక్సినేషన్ తీసుకున్న వారు మాత్రమే వారిని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మాత్రమే అనుమతించనున్నారు. 

మరిన్ని వార్తల కోసం..

రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం

కేసీఆర్ సొరంగంలో దాక్కున్నా వదిలిపెట్టం