బ్రెయిన్​ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే.. 

బ్రెయిన్​ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే.. 

కరోనా నుంచి కోలుకున్న కొందరిలోబ్రెయిన్​ స్ట్రోక్​ కనిపిస్తోంది. ఈ పరిస్థితి గురించి అవేర్​నెస్​ లేకపోవడంతో బ్రెయిన్​ స్ట్రోక్​ బారిన పడేవాళ్ల సంఖ్య పెరుగుతూ పోతోంది. స్ట్రోక్​కి గురయ్యే వాళ్లలో యంగ్​స్టర్స్​ ఎక్కువగా ఉంటున్నారని చెబుతున్నారు న్యూరో సర్జన్​ విశ్వనాథన్​ అయ్యర్​. మెదడుకు రక్తాన్ని తీసుకుపోయే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టినప్పుడు లేదా ఆ రక్తనాళాల సైజ్​ తగ్గినప్పుడు బ్రెయిన్​ స్ట్రోక్​ వస్తుంది. పెద్దవాళ్లతో పోల్చితే చిన్న వయసులోనే స్ట్రోక్​ రావడం వాళ్ల జీవితం మీద నెగెటివ్​ ఎఫెక్ట్​ చూపిస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్​ పేషెంట్స్​ మొదటి కొన్ని నెలల్లో డిప్రెషన్​కు లోనవుతారు. ఆ టైంలో వాళ్లకు కౌన్సెలింగ్​ చాలా అవసరం. 
కారణాలివే
బీపీ, స్మోకింగ్​, డయాబెటిస్, గుండె సంబంధిత రోగాలు, డ్రగ్స్​ అలవాటు, ఊబకాయం కూడా బ్రెయిన్​ స్ట్రోక్​కు దారి తీస్తాయి. ఇలాంటి రిస్క్​ ఫ్యాక్టర్స్​ భవిష్యత్తులో కూడా స్ట్రోక్​కు కారణమవుతాయని పలు 'స్టడీస్​ చెప్తున్నాయి. యంగ్​స్టర్స్​లోనే కాకుండా పెద్దవాళ్లలోనూ ఈ సింప్టమ్స్​ స్ట్రోక్​కు దారి తీస్తున్నాయి. మెదడును, మనిషిని బలహీనం చేసే ఈ సమస్య లక్షలాదిమంది భారతీయుల్లో ఉంది. అయితే ఈ సమస్య ఉందనే విషయం వాళ్లకు  అస్సలు తెలియదు. స్ట్రోక్​కు గురైన వాళ్లు తిరిగి నార్మల్​ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. అయితే, మెదడు ఎంత ఎఫెక్ట్​ అయింది, కేర్​టేకర్స్​ ఇచ్చే సపోర్ట్, స్ట్రోక్​ రావడానికి ముందు వాళ్ల ఆరోగ్యం పరిస్థితి, పేషెంట్స్​ మోటివేషనల్​ లెవల్స్​...  వంటివి వాళ్లు ఎంత త్వరగా కోలుకుంటారనే దానిపై ప్రభావం చూపిస్తాయి. 
త్వరగా కోలుకునేందుకు
హెల్దీగా, హార్టీగా ఉండేందుకు పోషకాలున్నవి తినాలి. ప్రాసెస్డ్​ ఫుడ్స్, షుగర్ ఉన్న డ్రింక్స్​, స్మోకింగ్, ఆల్కహాల్ మానేయ్యాలి. ఉప్పు బాగా తగ్గించాలి. రోజూ ఎక్సర్​సైజ్​ చెయ్యాలి​. దాంతో గుండె జబ్బులు రావు. అలాగే బ్రెయిన్​స్ట్రోక్​ రాకుండా జాగ్రత్తపడొచ్చు.