సన్​స్క్రీన్ ఎలర్జీ నుంచి బయటపడేందుకు జాగ్రత్తలు

సన్​స్క్రీన్ ఎలర్జీ నుంచి బయటపడేందుకు జాగ్రత్తలు

ఎండలో బయటికి వెళ్లేటప్పుడు.. అల్ట్రావయెలెట్​ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు సన్​స్క్రీన్ రాసుకుంటారు చాలా మంది. అయితే కొందరికి సన్​స్క్రీన్ పడదు. దాంతో వాళ్లలో  ఒంటి మీద ఎర్రని దద్దుర్లు, చీము నిండిన కురుపులు, మచ్చలు ఏర్పడడం, చర్మం దురద పెట్టడం వంటి ఎలర్జీ లక్షణాలు కనిపిస్తాయి. సన్​స్క్రీన్ ఎలర్జీ నుంచి బయటపడేందుకు డెర్మటాలజిస్ట్ గీతికా మిట్టల్ గుప్తా చెప్తున్న జాగ్రత్తలు కొన్ని.   

సన్​స్క్రీన్ వల్ల ఎలర్జీ వస్తుందా? లేదా? తెలుసుకునేందుకు ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. చేతుల మీద సన్​స్క్రీన్ రాసుకోవాలి. ఎనిమిది గంటలైనా ఎలాంటి ఎలర్జీ లక్షణాలు లేకుంటే సన్​స్క్రీన్ పడుతుందని అర్థం. అన్నిరకాల చర్మాల వాళ్లకు ఒకేరకమైన సన్​స్క్రీన్ సరిపోదు. అందుకని డాక్టర్​ని కలిసి చర్మతత్వానికి సరిపోయే సన్​స్క్రీన్ వాడితే మంచిది. 

వాసన, రంగులు లేని సన్​స్క్రీన్ వాడాలి. అంతేకాదు  పారా అమినోబెంజోయిక్ యాసిడ్, బెంజోఫెనోన్​–2, బెంజోఫెనోన్​–3 వంటి కెమికల్స్ ఉన్న సన్​స్క్రీన్స్ కొనొద్దు.  

కొబ్బరి నూనె, అలొవెరా జెల్, జింక్ ఆక్సైడ్, వాల్​నట్ నూనెతో ఇంటిదగ్గర తయారుచేసుకున్న సన్​స్క్రీన్ వాడుతుంటారు కొందరు. ఇవి అల్ట్రావయెలెట్ బి  కిరణాల నుంచి పూర్తి రక్షణ ఇవ్వవు. కొన్నిసార్లు చర్మం మీద మచ్చలు, దురద పెట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి కూడా.  అందుకని వీటి బదులు  జింక్ ఆక్సైడ్, టైటానియం ఆక్సైడ్ వంటి మినరల్స్ ఉన్న సన్​స్క్రీన్ వాడాలి.