
మల్టిపుల్ జానర్స్‌లో నటిస్తూ సౌత్‌తో పాటు నార్త్‌లోనూ హీరోయిన్‌గా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది శ్రుతిహాసన్. ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. వాటిలో ఒకటి ‘కూలీ’. రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి శుక్రవారం శ్రుతి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే ఆమె పాత్రను కూడా పరిచయం చేశారు.
ఈ పోస్టర్‌లో పొడవాటి పారను పట్టుకుని ఇంటెన్స్ లుక్‌లో ఆకట్టుకుంటోంది శ్రుతి. ఇందులో ఆమె ప్రీతి పాత్రలో కనిపించనున్నట్టు రివీల్ చేశారు. ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉపేంద్ర, సత్యరాజ్, శోభిన్ సహైర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు తెలుగులో అడివి శేష్‌కి జంటగా ‘డెకాయిట్’ సినిమాతో పాటు సలార్2, చెన్నై స్టోరీ చిత్రాలు ప్రస్తుతం శ్రుతి చేతిలో ఉన్నాయి.