
సంతోష్ శోభన్ హీరోగా అభిషేక్ మహర్షి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’. రాశీ సింగ్, రుచిత సాదినేని హీరోయిన్స్. శివ ప్రసాద్ పన్నీరు నిర్మించారు. బుధవారం ఈ సినిమా నుంచి ‘సుందరీ..’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ‘సుందరీ.. ఓ కన్నే.. నీ వైపే నన్నే.. లాగింది చూపుల దారమే.. నీ కన్నుల్లోనే.. దాగింది మిన్నే’ అంటూ సాగే ఈ మెలోడియస్ సాంగ్‌ను ఎస్.అనంత్ శ్రీకార్ కంపోజ్ చేశాడు.
‘తొలిచూపే శుభలేఖే రాసిందా ఇలా.. సుందరీ.. ఊహలకే పరుగే మొదలే’ అంటూ కిట్టు విస్సాప్రగడ రాసిన లిరిక్స్, కార్తిక్ సింగింగ్ ఇంప్రెస్ చేస్తున్నాయి. కృష్ణ తేజ, కృష్ణ చైతన్య, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.