సెకెండ్‌‌‌‌ వీక్‌‌‌‌ నుంచి స్టార్ట్ చేయడానికి పక్కా ప్లాన్ సిద్ధం !

సెకెండ్‌‌‌‌ వీక్‌‌‌‌ నుంచి స్టార్ట్ చేయడానికి పక్కా ప్లాన్ సిద్ధం !

‘ఆర్ఆర్ఆర్’తో దేశవ్యాప్తంగానే కాదు.. వరల్డ్ వైడ్‌‌‌‌ ఫేమస్ అయిపోయాడు ఎన్టీఆర్. అయితే ఆ సినిమా రిలీజై నాలుగు నెలలైనా ఇంకా తన నెక్స్ట్‌‌‌‌ ప్రాజెక్ట్ మొదలు కాలేదనే నిరాశ ఆయన అభిమానుల్లో కనిపిస్తోంది. ఓవైపు చరణ్  శంకర్ మూవీని కూడా చకచకా పూర్తి చేసేస్తున్నాడు. తారక్ నుంచి కొరటాల శివ, ప్రశాంత్ నీల్ వంటివారితో  క్రేజీ అనౌన్స్‌‌‌‌మెంట్స్ అయితే వచ్చినా ఇంత వరకు ఒక్కటీ పట్టాలెక్కలేదు. నిజానికి కొరటాల మూవీ ఇప్పటికే మొదలవ్వాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ఇక ఎదురు చూపులకు ఫుల్‌‌‌‌స్టాప్ పడే సమయం వచ్చినట్టే ఉంది. ఈ మూవీ రెగ్యులర్ షూట్‌‌‌‌ను సెప్టెంబర్ సెకెండ్‌‌‌‌ వీక్‌‌‌‌ నుంచి స్టార్ట్ చేయడానికి పక్కా ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలిసింది. ఆల్రెడీ జూబ్లీహిల్స్‌‌‌‌లో భారీ సెట్ వేస్తున్నారట.

మరోవైపు ఎన్టీఆర్‌‌‌‌ కూడా ‌‌‌‌మేకోవర్‌‌‌‌‌‌‌‌పై దృష్టి పెట్టాడట. వీలైనంత ఫాస్ట్‌‌‌‌గా షూటింగ్ పూర్తిచేసి వచ్చే సంక్రాంతికి  సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారట నిర్మాతలు నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని. ఇందులో తారక్ రెండు డిఫరెంట్ షేడ్స్‌‌‌‌లో కనిపిస్తాడని టాక్. వాటిలో ఒక పాత్ర స్టూడెంట్ లీడర్‌‌‌‌‌‌‌‌ అని ప్రచారం జరుగుతోంది. హీరోయిన్‌‌‌‌గా కీర్తి సురేష్, రష్మికలతో పాటు మరికొందరి పేర్లు వినిపించాయి. ఇందులో సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడని, తారక్‌‌‌‌కి బావమరిదిగా కనిపిస్తాడనే గుసగుసలూ వినిపిస్తున్నాయి. వీటన్నింటిపై ఎప్పటికి క్లారిటీ వస్తుందా అని ఫ్యాన్స్ వెయిటింగ్. అయితే ఈ నెల 29న జరగనున్న కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ ప్రీ రిలీజ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌‌‌‌గా వస్తున్నాడు. దాంతో ఈ వేడుకలో ఎన్టీఆర్ కొత్త లుక్ చూసే ఛాన్స్ దొరకొచ్చు.