ఇద్దరు తెలంగాణ హైకోర్టు జడ్జిల బదిలీ

ఇద్దరు తెలంగాణ హైకోర్టు జడ్జిల బదిలీ

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ హైకోర్టుకు చెందిన ఇద్దరు జడ్జిల బదిలీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. తెలంగాణ, అలహాబాద్, కోల్​కతా హైకోర్టులకు సంబంధించిన ఐదుగురు జడ్జిల బదిలీకి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు కోలిజియం సిఫార్సు చేసింది.

ఈ సిఫార్సులకు సోమవారం రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రాం మేఘావాల్ ట్విట్టర్‌‌‌‌లో వెల్లడించారు. దీంతో తెలంగాణ హైకోర్టుకు చెందిన జస్టిస్ ఎం.సుధీర్ కుమార్ మద్రాస్‌‌ హైకోర్టుకు, జస్టిస్ సి.సుమలత కర్నాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. కోల్‌‌కతా హైకోర్టుకు చెందిన జస్టిస్ శేఖర్ బి.సరఫ్, జస్టిస్ బిబేక్ చౌధరి వరుసగా అలహాబాద్, పాట్నా హైకోర్టులకు ట్రాన్స్‌‌ఫర్ అయ్యారు. అలహాబాద్ హైకోర్టు నుంచి జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు.