రంగుల పండుగ శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని, రాష్ట్రపతి

రంగుల పండుగ శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని, రాష్ట్రపతి

రంగుల హోలీ పండగ సందర్భంగా.. దేశవ్యాప్తంగా ప్రజలందరూ హోలీ సంబురాల్లో మునిగిపోయారు.  దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ హోలీ, కేంద్రమంత్రులు శుభాకాంక్షలు చెప్పారు. 

ప్రజలందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలి

‘‘హోలీ పండుగ సందర్భంగా దేశప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. రంగుల పండుగ హోలీ..  సమాజంలో సామరస్యానికి ప్రతీక. ఇది వసంత రుతువు రాకను చెప్పే పండుగ. ఈ పండుగ దేశప్రజలందరి జీవితాల్లో ఆనందాన్ని, ఉత్సాహాన్ని, కొత్త శక్తిని నింపాలని కోరుకుంటున్నాను’’ అని రాష్ట్రపతి కోవింద్ అన్నారు.

ప్రేమ, ఆప్యాయతకు ప్రతీక

‘‘దేశ ప్రజలందరికీ హోలీ పండుగ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. పరస్పర ప్రేమ, ఆప్యాయత, సోదర భావానికి ప్రతీక అయిన ఈ రంగుల పండుగ మీ జీవితంలో ఆనందాన్ని తీసుకురావాలి’’ అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

స్నేహ బంధాన్ని బలోపేతం చేద్దాం

దేశ ప్రజలకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. దేశమంతా ఈ రంగుల పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటారని, ఈ హోలీ సందర్భంగా మన సమాజాన్ని ఒక్కటిగా చేసే స్నేహబంధాన్ని, సామరస్య పూర్వక వాతావరణాన్ని మరింత బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ పండుగ మన జీవితాల్లో శాంతి సామరస్యాలను, ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నానని అన్నారు.

ఇక, రంగులు, ఆనందాల సమ్మేళనేమే హోలీ అని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. ఈ పండుగ అందరి జీవితాల్లో శాంతి, అదృష్టాన్ని నింపాలని కోరుకుటున్నానని అన్నారు. కలర్స్, పాజిటివిటీ, చైతన్యం, సంతోషం, సామరస్యాలకు ప్రతీక హోలీ అని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ప్రజలందరికీ  కేంద్రమంత్రి ముక్తర్ అబ్బాస్ నఖ్వీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

రష్యా ఆయిల్‌‌ కొనుగోలుకు భారత్ టెండర్లు!

మరోసారి మెగాఫోన్ పట్టిన ‘ఫలక్‌‌‌‌నుమా దాస్‌‌‌‌’

కరోనాపై మరోసారి రాష్ట్రాలకు కేంద్రం అలెర్ట్