న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరుగుతోంది

న్యాయ వ్యవస్థపై  నమ్మకం పెరుగుతోంది

ఇంటర్నేషనల్ జ్యుడీషియల్ కాన్ఫరెన్స్ లో రాష్ట్రపతి కోవింద్

న్యూఢిల్లీ:  మన న్యాయ వ్యవస్థ జెండర్ జస్టిస్ ను లక్ష్యంగా పెట్టుకుందని, ఈ విషయంలో సుప్రీంకోర్టు క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. ఆదివారం ఢిల్లీలో ఇంటర్నేషనల్ జ్యుడీషియల్ కాన్ఫరెన్స్ 2020లో ఆయన పాల్గొన్నారు. ‘జ్యుడీషయరీ-–చేంజింగ్ వరల్డ్’ అంశంపై ఆయన మాట్లాడారు. సమాజంలో ప్రగతిశీల మార్పులకు సుప్రీంకోర్టు నాయకత్వం వహిస్తోందని, రెండు దశాబ్దాల నాటి విశాక గైడ్ లైన్స్ ,  వర్క్ ప్లేస్ లో మహిళలపై లైంగిక వేధింపులు, ఆర్మీలో మహిళా ఆఫీసర్లకు  శాశ్వత కమిషన్, కమాండ్ పోస్టింగ్ లపై సుప్రీంకోర్టు ఆదేశాలను ఆయన ప్రస్తావించారు. సుప్రీంకోర్టు తీర్పులు 9 భాషల్లో లభించడంపై  సంతోషం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ తీర్పులతో న్యాయ వ్యవస్థపై ప్రజలకు  నమ్మకం పెరుగుతోందని, రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని చెప్పారు. పర్యావరణ పరిరక్షణతోపాటు సుస్థిర అభివృద్ధిని సమన్వయం చేయడంలో న్యాయ వ్యవస్థ పాత్ర కీలకంగా మారిందన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో రెవల్యూషన్ వల్ల డేటా ప్రొటెక్షన్, రైటు టు ప్రైవసీ లాంటి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటిని జ్యుడీషియరీ సమర్థవంతంగా డీల్ చేస్తోందని చెప్పారు. వివాదాల పరిష్కారానికి సుదీర్ఘమైన న్యాయ ప్రక్రియకు బదులుగా మీడియేషన్, కన్సీలియేషన్ లాంటి  ప్రత్యామ్నాయాలను ప్రోత్సాహించాలన్నారు.  పర్యావరణానికి సంబంధించిన అంశాలపై చట్టాలకు సంబంధించి ఇంటర్నేషనల్ లెవెల్ లో సింగిల్ సిస్టమ్ ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు  చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బోబ్డే అన్నారు.