
అప్పట్లో ప్రేమ కోసం బార్డర్ దాటి పాకిస్తాన్ కు వెళ్లిన వ్యక్తిని చూశాం. అలాంటి స్టోరే ఇది. బార్డర్ దాటలేదు. కానీ PUBG లో పరిచయమైన లవర్ కోసం దాదాపు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించాడు. లవర్ కోం అబ్బాయి ఒక్కడే త్యాగం చేయలేదు.. ఆమె కూడా తన లవర్ కోసం తన ఫ్యామిలీని.. అంటే మూడుముళ్లం బంధంతో ఒక్కటైన భర్తను, కాపురానికి గుర్తుగా పుట్టిన పిల్లలను వదిలేసేందుకు సిద్ధమైంది. ఈ అమరప్రేమికుల వీర విజయ గాథ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని మహోబాలో జరిగింది ఈ ఘటన. కేవలం పబ్ జీ ఆడుతూ లవ్ లో పడిపోయారు వీళ్లిద్దరు. పెళ్లై పిల్లలు ఉన్నారన్న సంగతి ఆమె మరిచింది.. ఆమెకు ఫ్యామిలీ ఉందన్న కనీస ఇంగిత జ్ఞానం అతడికి లేకుండా పోయింది. ఇంకేముంది వెయ్యి కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన లవర్ కోసం ఫ్యామిలీని వదిలేసింది.
పంజాబ్ లోని లూథియానా నుంచి ఉత్తరప్రదేశ్ లోని మహోబాకు.. డైరెక్టుగా ఆమె ఇంటికే వచ్చేశాడు లవర్. దీంతో భర్తతో పాటు కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. దీంతో ఆ ఇంట్లో ఆ క్షణం పెద్ద గొడవే జరిగింది. ఎంతమంది మందలించినా.. ఎవరు వారించినా అందరిపైకి శివంగిలా యుద్ధానికి సిద్ధమైంది. భర్తను, పిల్లలను వదిలి పబ్ జీ లవర్ తో వెళ్తానని తెగేసి చెప్పింది.
మీరట్ మర్డర్ లాగే 55 ముక్కలుగా నరుకుతా:
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఈమె స్టోరీలో మరో ట్విస్ట్ కూడా ఉంది. తమ ప్రేమకు అడ్డొస్తే 55 ముక్కలుగా నరుకుతానని భర్తను బెదరించింది. మీరట్ మర్డర్ లాగే 55 తుకుడలుగా నరికి డ్రమ్ లో వేసి సిమెంట్, వాటర్ పోస్తానని భర్తను బెదిరించింది.
లవ్ ఎలా స్టార్ట్ అయ్యిందంటే:
ఉత్తరప్రదేశ్ లోని బాంద జిల్లాకు చెందిన ఆరాధన.. 2022 లో మొహాబ లోని శీలు అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. వాళ్లిద్దరికి ఏడాదిన్నర బాబు కూడా ఉన్నాడు. అయితే ఆరాధన ఇంటిదగ్గర ఉండి PUBG గేమ్ కు అడిక్ట్ అయ్యింది. ఈ గేమ్ లో శివమ్ అనే వ్యక్తితో పరిచయం అయ్యింది. ఇద్దరు కలిసి రెగ్యులర్ గేమ్ ఆడేవారు. శివమ్ పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాకు చెందిన వ్యక్తి. వాళ్ల గేమ్ స్నేహం కాస్త ప్రేమగా మారింది.
ALSO READ | యూట్యూబర్లకు షాక్..ఆ ఏజ్గ్రూప్వాళ్లకు యూట్యూబ్ సేవలు బంద్
అయితే 14 నెలల క్రితం ఆమెతో పరిచయం ఏర్పడినట్లు శివమ్ చెప్పాడు. అయితే తన భర్త కొట్టినట్లు ఆమె చెప్పడంతో వెంటనే మొహాబ చేరుకున్నాడు శివమ్. ఏదో అధికారం ఉన్నట్లుగా ఆరాధన భర్త శీలుతో గొడవకు దిగాడట. దీంతో శీలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శివమ్ ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
అయితే శివమ్ ను అరెస్టు చేసి తీసుకెళ్తుంటే.. ఆరాధన పోలీస్ స్టేషన్ వరకు పరుగెత్తుకుంటూ వెళ్లిందట. తనను వదిలి పెట్టాలని, తనతో వెళ్లిపోతానని పోలీసులతో వాదించింది. తన భర్త తాగుబోతు అని, ఇంట్లో ఎప్పుడూ హింసిస్తాడని.. అందుకే శివమ్ తో వెళ్లేందుకు డిసైడ్ అయినట్లు పోలీసులకు చెప్పిందట. పోలీసుల ముందు భార్య భర్తకు మద్య జరిగిన వాగ్వాదంలో లవర్ తో వెళ్లిపోతానని, భర్తతో బతకలేనని పదేపదే చెప్పిందట. అయితే పోలీసులు సెక్షన్ 151 కింద కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లారు. దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.