డబ్ల్యూహెచ్​వోకు పైసలిస్తం, కానీ…

డబ్ల్యూహెచ్​వోకు పైసలిస్తం, కానీ…

‘షరతులతో’ మనసు మార్చుకున్న అమెరికా

వాషింగ్టన్​: చైనా చెప్పినట్టే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) పనిచేస్తోందని ఆరోపించిన అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​.. ఆ సంస్థకు పైసలివ్వడం ఆపేశారు. మళ్లీ ఇప్పుడు ఆయన మనసు మార్చుకున్నట్టు, డబ్ల్యూహెచ్​వోకు మళ్లీ పైసలిచ్చేందుకు ఆయన ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి వైట్​హౌస్​ డ్రాఫ్ట్​ లెటర్​ ఒకటి బయటకు లీక్​ అయినట్టు సమాచారం. ఆ లెటర్​ ప్రకారం కొన్ని షరతులతో డబ్ల్యూహెచ్​వోకు నిధులివ్వడానికి ట్రంప్​ రెడీ అయినట్టు తెలుస్తోంది. ‘‘డబ్ల్యూహెచ్​వో పనితీరు ప్రస్తుతం బాగాలేకపోయినప్పటికీ, ఇంకా సంస్థకు ఓ గొప్ప శక్తి ఉన్నట్టు భావిస్తున్నా. ఆ శక్తికి తగ్గట్టు సంస్థ పని చేయాలని కోరుకుంటున్నా. ప్రత్యేకించి ఈ కరోనా టైంలో మరింత బాధ్యతగా పనిచేయాలి. అందుకే సంస్థకు మళ్లీ నిధులివ్వాలని నిర్ణయించుకున్నా. కలిసి పనిచేయాలనుకుంటున్నా. ప్రపంచానికి చైనా ఎంతో బాకీ పడింది. ఇప్పుడు కనీసం డబ్ల్యూహెచ్​వోకు నిధులు మంచిగా ఇస్తే బాగుంటుంది. ఆ దేశం ఎంత ఇస్తే దానికి తగ్గట్టు మేమిచ్చే పైసలు పెంచుతాం’’ అని ట్రంప్​ చెప్పినట్టు ఆ లెటర్​లో ఉన్నట్టు సమాచారం.