చెమట వాసన రాకుండా..

చెమట వాసన రాకుండా..

వానలు పడుతున్న ఈ టైంలో వాతావరణం తేమగా ఉంటుంది. దాంతో తొందరగా చెమట పడుతుంటుంది. చెమట కారణంగా ర్యాషెస్​ వస్తాయి. చర్మం ఎర్రగా అవుతుంది. దుర్వాసన వస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే... సీజన్​కి తగ్గ సోప్​ వాడాలి. రెయినీ సీజన్​లో చెమట, తడి వల్ల బ్యాక్టీరియా చేరుతుంది. యాంటీ బ్యాక్టీరియల్​ సోప్​ వాడితే బ్యాక్టీరియా పోతుంది. చర్మం తాజాగా కనిపిస్తుంది.   ఎసెన్షియల్​ ఆయిల్ కలిపిన నీళ్లతో స్నానం చేస్తే ఫ్రెష్​గా ఉంటుంది. పెప్పర్​మింట్​ ఆయిల్​ కలిపిన నీళ్లతో స్నానం చేసినా కూడా చెమట వాసన రాదు.   అలాగే, ఈ టైంలో ఘాటుగా, స్పైసీగా ఉన్న ఫుడ్​ తగ్గించాలి. ఈజీగా అరిగే  సలాడ్స్​, కూరగాయలు వంటివి ఎక్కువ తినాలి.