
హైదరాబాద్, వెలుగు: జీఎస్‌టీ తగ్గింపు ప్రయోజనాలను తమ కస్టమర్లకు అందిస్తామని సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రకటించింది. ‘‘రెడీమేడ్ బట్టలపై ఇదివరకు 12 శాతంగా ఉన్న జీఎస్‌టీ ప్రస్తుతం 5 శాతానికి తగ్గింది. దీంతో రూ.2,500 లోపు విలువైన వస్త్రాల ధరలు 6.25 శాతం తగ్గుతాయి.
జీఎస్‌టీ తగ్గింపు ప్రయోజనాలను నేరుగా కస్టమర్లకే అందిస్తున్నాం” అని సంస్థ చైర్మన్ మావూరి వెంకటరమణ అన్నారు. అంతేకాకుండా దసరా సందర్భంగా డిస్కౌంట్లను సంస్థ ప్రకటించింది. రూ.999 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలుపై స్పాట్‌లోనే ఒక గిఫ్ట్ పొందొచ్చు. వన్ ప్లస్ వన్ ఆఫర్లు, కాంబో ఆఫర్లు వంటివి కూడా సీఎంఆర్ షాపింగ్ మాల్ అందిస్తోంది.