ఇవాళ ఉత్తరాఖండ్‌‌లో ప్రధాని మోదీ ప్రచారం

ఇవాళ ఉత్తరాఖండ్‌‌లో ప్రధాని మోదీ ప్రచారం

డెహ్రాడూన్‌ ‌:  ఉత్తరాఖండ్‌‌లో ప్రధాని మోదీ లోక్‌‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఉధంసింగ్‌‌ నగర్​ రుద్రపూర్‌‌‌‌లో మంగళవారం నిర్వహించనున్న ఓ ర్యాలీలో మోదీ పాల్గొంటారు. ఈ ర్యాలీకి లక్ష మందికి పైగా ప్రజలు హాజరవుతారని ఆ రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్‌‌ మహేంద్ర భట్‌‌ తెలిపారు. 

ఉత్తరాఖండ్‌‌ ప్రధాని గుండెల్లో ఉందని సీఎం పుష్కర్‌‌‌‌ సింగ్‌‌ ధామి అన్నారు. మోదీ పర్యటన కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. గత పదేండ్లలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రాజెక్టులు మంజూరు చేసిందని తెలిపారు. రుద్రపూర్‌‌‌‌ నుంచి మోదీ లోక్‌‌సభ ఎన్నికల క్యాంపెయిన్‌‌ ప్రారంభించ డం నిజంగా తమ అదృష్టమన్నారు