డెయిరీ అండ్ పొటాటో ప్లాంట్ ను ప్రారంభించిన మోడీ

డెయిరీ అండ్ పొటాటో ప్లాంట్ ను ప్రారంభించిన మోడీ

బనస్కాంత: గుజరాత్ రాష్ట్రం బనాస్కాంత జిల్లాలోని డియోదర్ లో మంగళవారం ‘డెయిరీ కాంప్లెక్స్ అండ్ పొటాటో ప్రాసెసింగ్ ప్లాంట్’ ను  ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ప్లాంట్ ద్వారా చాలామందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. దేశంలో పాలు, ఆలుగడ్డ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిందన్న ఆయన... ఈ ప్లాంట్ ద్వారా లక్షల టన్నుల పాలు, పొటాటో ఉత్పత్తులు తయారవుతాయన్నారు. దీంతో ప్రజల ఆహారావసరాలు కొంతమేరకైనా తీరనున్నట్లు మోడీ పేర్కొన్నారు. 

ఇక ప్లాంట్ విషయానికొస్తే ... మొత్తం రూ.600 కోట్ల వ్యయంతో ఈ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ను నిర్మించారు. డెయిరీ ప్లాంట్ లో రోజుకు దాదాపు 30 లక్షల లీటర్ల పాలను ప్రాసెసింగ్ చేస్తారు. రోజుకు 80 టన్నుల వెన్న, లక్ష లీటర్ల ఐస్‌క్రీం, 20 టన్నుల కండెన్స్‌డ్ మిల్క్, 6 టన్నుల చాక్లెట్‌లను ఈ ప్లాంట్ ఉత్పత్తి చేస్తుంది. ఇక పొటాటో ప్లాంట్ ద్వారా రకరకాల ఆలు గడ్డ ఐటెమ్స్ ను ఉత్పత్తి చేస్తారు. ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో చిప్స్, ఆలూ టిక్కీ, ప్యాటీస్ మొదలైనవాటిని ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. ఇక్కడ తయారయ్యే చాలా ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేయనున్నారు. 

మరిన్ని వార్తల కోసం...

జహీరాబాద్ అభివృద్ధికి రూ. 50 కోట్లు మంజూరు

డిజిటల్ కరెన్సీ వల్ల మనీ ల్యాండరింగ్కు అవకాశం