ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కొనసాగుతోంది. ఏయూ గ్రౌండ్స్ కు చేరుకున్న ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. మోడీతో పాటు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, ఏపీ సీఎం జగన్ ఆయన వెంట ఏయూ కాలేజీ బహిరంగ సభకు చేరుకున్నారు. ఏయూ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల నమూనాలను మోడీ పరిశీలించారు. అలాగే రోడ్లు, రైల్వేల నమూనాలను ఆసక్తిగా తిలకించారు.
ఏపీలో పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రూ.10,742 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. అలాగే.. ఇప్పటి వరకు 5 ప్రాజెక్టును ఆయన వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. మోడీ విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో నగరంలో భారీ భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. ఉదయం నుంచే ట్రాఫిక్ ఆంక్షలను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పహారా కాస్తున్నారు.
