డ్రెస్సింగ్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా ప్లేయర్లకు మోదీ ఓదార్పు

డ్రెస్సింగ్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా ప్లేయర్లకు మోదీ ఓదార్పు

న్యూఢిల్లీ: వన్డే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలై తీవ్ర నిరాశలో ఉన్న ఇండియా ప్లేయర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓదార్చారు. ఫైనల్ ముగిసిన తర్వాత టీమిండియా డ్రెస్సింగ్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌కు వెళ్లిన మోదీ ఆటగాళ్లతో మాట్లాడి వారిలో ధైర్యం నింపారు. 

టోర్నీలో టాప్ వికెట్‌‌‌‌‌‌‌‌ టేకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షమీని హత్తుకున్న మోదీ.. రోహిత్​, కోహ్లీ, జడేజా, కోచ్‌‌ ద్రవిడ్‌‌తో మాట్లాడారు.   డ్రెస్సింగ్ రూమ్‌‌‌‌‌‌‌‌కు వచ్చి తమలో ధైర్యం నింపిన మోదీకి థ్యాంక్స్‌‌‌‌‌‌‌‌ చెబుతూ జడేజా, షమీ ట్వీట్ చేశారు.