త్వరలో గుజరాత్లో 50 లక్షల ఆయుష్మాన్ కార్డులు పంపిణీ

త్వరలో గుజరాత్లో 50 లక్షల ఆయుష్మాన్ కార్డులు పంపిణీ

ఒకే దేశం ..ఒకే ఎరువులు పథకాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ. రైతుల ఖాతాలో కిసాన్ సమ్మాన్ నిధుల కింద 16 వేల కోట్లను జమ చేశారు. ఆ తర్వాత 600 కిసాన్ సమ్మాన్ సమృద్ధి కేంద్రాలను జాతికి అంకితం ఇచ్చారు. గుజరాత్ ఆయుష్మాన్ లబ్ధిదారులతో వీడియోకాన్ఫరెన్స్ లో మాట్లాడిన మోడీ.. 50 లక్షల కార్డులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. 

ఒకే దేశం.. ఒకే ఎరువుల పేరుతో దేశ వ్యాప్తంగా రైతులకు నాణ్యమైన ఎరువులు అందిస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎం కిసాన్ పథకం కింద 12వ విడత నగదును ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా 11 కోట్ల మంది లబ్ధిదారులకు గానూ.. 16 వేల కోట్లను జమచేశారు. అతితక్కువ ధరలకే రైతులకు ఎరువులు దొరుకుతాయన్నారు. రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు నానో యూరియాను తీసుకొచ్చామన్నారు. నీటిని సంరక్షించడానికి బిందు సేధ్యం, స్ప్రింకర్ల వినియోగానికి ప్రాముఖ్యత ఇస్తున్నామన్నారు. సహాజవ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు మోడీ. 

 ఢిల్లీలోని పుసా క్యాంపస్ లో పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ పేరుతో రెండు రోజులపాటు జరుగుతున్న కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా 600 పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను మోడీ ప్రారంభించారు. రైతుల వివిధ అవసరాలను తీర్చే విధంగా కిసాన్ సంవృద్ధి కేంద్రాలు పనిచేయనున్నాయి. పంటల సాగు కోసం రైతులకు అవసరమైన సామాగ్రిని అందుబాటులో ఉంచుతారు. రైతుల భూసార పరీక్షలతో పాటు.. వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడనున్నాయి.  ఈ కార్యక్రమంలో వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్ తోమార్, మన్సుఖ్ మాంఢవీయ, 13వేల 500 మంది రైతులు,1500 మంది వ్యవసాయ స్టార్టప్ల ప్రతినిధులు పాల్గొన్నారు. 

 గుజరాత్ లో 50 లక్షల ఆయుష్మాన్ కార్డులు ముద్రించామని.. త్వరలో వాటిని పంపిణీ చేస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆయుష్మాన్ లబ్ధిదారులతో ప్రధాని వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. పేద కుటుంబాల వైద్యఖర్చు కోసం 2 లక్షల వరకు ప్రభుత్వం భరిస్తోందన్నారు.  ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 46 లక్షల మంది పేదలు లబ్ధిపొందారన్నారు. ఆయుష్మాన్ పథకం అవగాహన కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు.

 రేపటి నుంచి ఈనెల 21 వరకు ఢిల్లీ ప్రగతి మైదాన్ లో జరిగే ఇంటర్ పోల్ 90వ జనరల్ అసెంబ్లీ లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. 195 ఇంటర్ పోల్ సభ్యదేశాలకు చెందిన మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు, 2వేల మంది విదేశీ ప్రముఖులు హాజరుకానున్నారు.