అక్టోబర్ 1న మోదీ సభ.. పాలమూరు ప్రజా గర్జన పేరుతో నిర్వహిస్తున్న బీజేపీ

అక్టోబర్ 1న మోదీ సభ.. పాలమూరు ప్రజా గర్జన పేరుతో నిర్వహిస్తున్న బీజేపీ
  • మధ్యాహ్నం 2.10 గంటలకు మహబూబ్ నగర్‌‌కు ప్రధాని
  • రూ.13,545 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
  • అనంతరం సభలో ప్రసంగించనున్న మోదీ.. 
  • భారీగా జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాష్ట్ర పర్యటనకు రానున్నారు. మహబూబ్‌నగర్ వేదికగా తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ‘పాలమూరు ప్రజా గర్జన’ పేరుతో భూత్పూర్ ఐటీఐ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహించనున్న సభలో ఆయన మాట్లాడనున్నారు. ఈ సభకు భారీగా జనాన్ని తరలించే ఏర్పాట్లలో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉంది. 

ముందుగా రూ.13,545 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. తర్వాత సభలో పాల్గొననున్నారు. సభా వేదికగా తెలంగాణకు ఏమైనా వరాలు ప్రకటించే అవకాశం ఉందా?  సీఎం కేసీ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టార్గెట్ చేసి మాట్లాడుతారా? బీఆర్ఎస్ సర్కార్ అవినీతిని ఆయన ప్రశ్నించనున్నారా? అనే చర్చ జోరుగా సాగుతున్నది.

భారీ ఏర్పాట్లు

మోదీ సభకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తున్నది. పార్టీ సీనియర్ నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎంపీ లక్ష్మణ్.. ఒకసారి పాలమూరు వెళ్లి ఏర్పాట్లను పరిశీలించి, జన సమీకరణపై స్థానిక నేతలకు దిశా నిర్దేశం చేశారు. సభకు వచ్చే జనాలకు ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాలమూరు టౌన్ కాషాయ వర్ణంలో మెరిసిపోతున్నది. మోదీ పాల్గొనే సభ వద్ద, సభకు వెళ్లే అన్ని ప్రధాన రోడ్లకు ఇరువైపులా మోదీ కౌటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, కాషాయ తోరణాలు కనిపిస్తున్నాయి. సభా ప్రాంగణం వద్ద మోదీ భారీ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

మోదీ టూర్ సాగేదిలా

ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మోదీ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2.10 గంటలకు మహబూబ్ నగర్ చేరుకుంటారు. మధ్యాహ్నం 2.15 నుంచి 2.50 వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీజేపీ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 4.45 గంటలకు హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. సాయంత్రం 5.10 గంటలకు అక్కడి నుంచి విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.