
తిరుమల: మారిషస్ దేశ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్గూలం సోమవారం (సెప్టెంబర్ 15) సాయంత్రం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ చైర్మన్, ఈవోలు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో టీటీడీ ఎక్స్ఆఫిషియో బోర్డు సభ్యులు దివాకర్ రెడ్డి, టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.