సర్కారు వారి పాట సెన్సార్ పూర్తి

సర్కారు వారి పాట సెన్సార్ పూర్తి

పరషురామ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా సర్కార్ వారి పాట. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శనివారం హైదరాబాదులో ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. పాటలు ఇప్పటికే విశేష ప్రజాదరణ పొందాయి. తమన్ మ్యూజిక్ కు మహేశ్ అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది. కళావతి, పెన్నీ పాటలు సోషల్ మీడియాను ఊపేయడం తెలిసిందే. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది.  ఈ సినిమా నిడివి 162 నిమిషాల 25 సెకన్లు. ఈ మేరకు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో తెలిపింది.