War 2: వార్ 2కి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్.. మాస్ మోత నెక్స్ట్ లెవల్

War 2: వార్ 2కి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్.. మాస్ మోత నెక్స్ట్ లెవల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr), బాలీవుడ్ స్టార్ హ్రితిక్ రోషన్(Hrithik Roshan) కాంబోలో వస్తున్న మోస్టన్ అవైటెడ్ మూవీ వార్ 2(War2). 2019లో వచ్చిన సూపర్ హిట్ మూవీ వార్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ భారీ నిర్మాణ సంస్థ యాష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా.. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. చాలా కాలం క్రితమే షూటింగ్ స్టార్ ఆయిన ఈ భారీ ప్రాజెక్టు పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర షూటింగ్ లో ఉన్న కారణంగా.. కేవలం హ్రితిక్ రోషన్ కు సంబందించిన పార్ట్ ఫినిష్ చేస్తున్నారు మేకర్స్. ఇక త్వరలోనే ఎన్టీఆర్ కూడా ఈ మూవీ షూట్ లో పాల్గొననున్నారు. 

ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా హైప్ క్రియేట్ అవుతోంది. దీంతో ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఆలాంటి మరో న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. చాలా రోజులుగా ఈ సినిమాకు మ్యూజిక్ ఎవరు చేయనున్నారు అనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అతేంకాదు.. బాలీవుడ్ నుండి చాలా మంది స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ పేర్లు కూడా వినిపించాయి. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం మేరకు ఆ సూపర్ కాంబో మూవీకి బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతం ను ఫిక్స్ చేశారట మేకర్స్. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని టాక్. 

ఇక వార్ 2 విషయానికి వస్తే.. ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం విలన్ గా కనిపించనున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హ్రితిక్ రోషన్ కు జోడీగా కియారా అద్వానీ కనిపించనున్నారు. కానీ, ఎన్టీఆర్ కి జోడీగా చేయబోయే హీరోయిన్ గురించి ఇంకా క్లారిటీ రాలేదు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.