సలార్ నుండి సాలిడ్ అప్డేట్.. వైల్డ్ లుక్లో అదరగొట్టిన పృథ్వీరాజ్

సలార్ నుండి సాలిడ్ అప్డేట్.. వైల్డ్ లుక్లో అదరగొట్టిన పృథ్వీరాజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్(Salaar). కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) తెరకెక్కిస్తున్న ఈ భారీ  సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ ఆ అంచనాలను ఆకాశానికెత్తేసింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అనేక వాయిదాల తరువాత ఎట్టకేలకు డిసెంబర్ 22న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

అయితే తాజాగా ఈ సినిమా నుండి మరో సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అక్టోబర్ 16 పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు సందర్బంగా ఆయన బర్త్ డే విశేష్ తెలియజేస్తూ సలార్ నుండి అయన లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో వరదరాజ మన్నార్ పాత్రలో చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు పృథ్వీరాజ్. చాలా వైల్డ్ గా ఉన్న ఈ లుక్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.