OTT Comedy Thriller: సరికొత్త వెర్షన్లో నవ్వించడమే టార్గెట్గా ఓటీటీలోకి తెలుగు కామెడీ థ్రిల్లర్..

OTT Comedy Thriller: సరికొత్త వెర్షన్లో నవ్వించడమే టార్గెట్గా ఓటీటీలోకి తెలుగు కామెడీ థ్రిల్లర్..

హాస్యనటుడిగా, హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు హీరో ప్రియదర్శి. ఈ యంగ్ టాలెంటెడ్ హీరో ప్రధాన పాత్రలో రీసెంట్గా నటించిన పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘మిత్రమండలి’ (Mithra Mandali). విజయేందర్ ఎస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియదర్శితో పాటు విష్ణు ఓఐ, రాగ్ మయూర్, నిహారిక NM ముఖ్య పాత్రలు పోషించారు.

సినిమా పేరుకు తగ్గట్టే, నలుగురు ప్రాణ స్నేహితుల మధ్య ఉండే సరదా సంభాషణలు, అల్లరి, మరియు అనుబంధాల చుట్టూ కథ అల్లుకుంది. దీపావళి సందర్భంగా (2025 అక్టోబర్ 16న) థియేటర్లలో విడుదలైన ‘మిత్ర మండలి’.. ఇవాళ (నవంబర్ 6న) ఓటీటీలోకి వచ్చేసింది.

ఈ మూవీ శాటిలైట్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకోగా, ఓటీటీ రైట్స్ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ మేరకు మిత్ర మండలి ఇవాళ నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, కేవలం 20 రోజుల్లోనే ‘మిత్ర మండలి’ ఓటీటీకి దర్శనం ఇవ్వడంతో, సినీ ఆడియన్స్ షాక్ అవుతున్నారు. థియేటర్లో డిస్సప్పాయింట్ చేసిన ఈ మూవీ, ఓటీటీలో ఏ మాత్రం నిరాశపరచకూడదనే ఉద్దేశ్యంతో.. మేకర్స్ కొత్త వెర్షన్ తీసుకొచ్చారు.  

మూవీ ఎలా ఉందంటే:

‘జాతిరత్నాలు’ సినిమా విడుదలయ్యాక.. రైటర్స్ ఆలోచనలే మారిపోయాయి. కథతో పెద్ద పని లేకుండా, రెట్టింపు నవ్వులు పంచడమే లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు చేసేస్తున్నారు. అంతేకాదు..‘సినిమా రిలీజ్ అయ్యాక.. ఇందులో కథ లేదనే’ విషయాన్నీ ఆడియన్స్ ఎత్తి చూపుతారని.. ముందే మేకర్స్ స్వయంగా చెప్పేస్తున్నారు.

అందుకే మిత్ర మండలి దర్శకుడు విజయేందర్, ముందే టైటిల్స్ కార్డ్స్‌లోనే క్లారిటీ ఇచ్చాడు. ఇందులో కథ ఉండదని. ఈ క్రమంలోనే ‘మిత్ర మండలి’.. నవ్వులు పంచడమే టార్గెట్ గా వచ్చింది. అయితే, కొత్త అనుభూతిని అందించలేక.. బాక్సాఫీస్ దగ్గర ఆశించినంతగా సక్సెస్ అవ్వలేకపోయింది. 

జాతి రత్నాలు, రీసెంట్‌గా లిటిల్ హార్ట్స్ సినిమాల్లో కథ లేకున్నా.. మనస్ఫూర్తిగా నవ్వుకునే కామెడీ ఉంటుంది. ఈ నేచురల్ కామెడీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. సినిమాను వారి నవ్వులపై మోసి, సూపర్ హిట్ అయ్యేలా చేశారు. సంద‌ర్భోచితంగా నవ్వుకునే నవ్వులే సినిమాకి మెయిన్ అస్సెట్. ఈ విషయాన్ని మిత్రమండలి ఓ 60% న్యాయం చేసింది. ఇందులో ప్రియదర్శి, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, విటివి గణేష్, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం ఇలా చాలా మంది కమెడియన్స్.. తమ ప్రాసలతో నవ్వించినప్పటికీ.. ఎక్కడో చిన్న వెలితి కనిపిస్తుంది. అదే మిస్సయిన నేచురల్ కామెడీ!. సినిమా మొత్తం సెటైరికల్ కామెడీగా, స్పూఫ్గా తెరకెక్కించారు. అదే కొంత మైనస్గా నిలిచింది. 

కథ పరంగా చూసుకుంటే.. లవ్ స్టోరీకి సామాజిక అంశాన్ని జతకట్టడం ఎప్పటిలాగే బలమైన అంశం. ఇందులో అది కొంతవరకు సక్సెస్ చేశారు డైరెక్టర్. ఎందుకంటే.. తన నవ్వించే ప్రయత్నంతోనే ఆడియన్స్ను ఆలోచింపజేశారు. సమాజంలో కుల పిచ్చితో ఉండే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూపించాడు. కుల పిచ్చి ఉన్న రాజకీయ నాయకుడు నిక్కచ్చిగా ఆలోచించే విధానం, ఈ క్రమంలో కులం చూసి ఓట్లు వేసే ప్రజలు, ప్రేమ పెళ్ళిళ్ళను వద్దనే వాళ్ళు.. ఇలా చాలా మైండ్ సెట్స్ వాళ్ల మీద బాగా సెటైర్స్ వేశారు. ఈ సెటైర్స్ అన్ని, నవ్విస్తూనే ఆలోచింపచేస్తాయి. ఏదేమైనా కొత్త వెర్షన్తో.. ఓటీటీ ఆడియన్స్కు వీకెండ్ ఫుల్ ఎంటర్టైన్ మెంట్ గ్యారంటీ!!